సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. మండలంలోని 548 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం పెట్టమంటున్న మీటర్లు రైతుల పాలిట తూటాలని హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణలోని ఆడపడుచులను కాంగ్రెస్, భాజపా పార్టీ వాళ్లా అని చూడకుండా సమానంగా కల్యాణ లక్ష్మి ఇస్తున్నామని తెలిపారు. పక్కనున్న కర్ణాటకలో భాజపా ప్రభుత్వం.. ఆడపిల్లల పెళ్లికి రూ. పది లేదా ఐదు వేలు, కనీసం ఐదు రూపాయలైన ఇస్తున్నారా అని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: 'కేంద్రం పైసలిస్తనంటే కేసీఆర్ వద్దన్నడు.. జగన్ ఆశపడ్డడు'