ETV Bharat / state

తెరాస రైతుల ప్రభుత్వం: మంత్రి హరీశ్​రావు

తెరాస ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదని తెలిపారు. రాబోయే దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

minister-harish-rao-distributed-the-pass-books-to-farmers-in-rayapol
తెరాస రైతుల ప్రభుత్వం: మంత్రి హరీశ్​రావు
author img

By

Published : Sep 24, 2020, 6:31 PM IST

జీఎస్టీ, ఐజీఎస్టీ 14వ ఆర్థిక సంఘం నిధులు బీఆర్​జీఎఫ్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.10 వేల కోట్ల కోటా ఇవ్వకుండా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మాయమాటలు చెబుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో 266 మంది రైతులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ ఛైర్​పర్సన్ రోజా శర్మలతో కలిసి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.

minister-harish-rao-distributed-the-pass-books-to-farmers-in-rayapol
తెరాస రైతుల ప్రభుత్వం: మంత్రి హరీశ్​రావు

తెరాస ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల కోసమే పని చేస్తోందని హరీశ్​రావు పేర్కొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదని తెలిపారు. రాబోయే దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాసకే పట్టం కట్టాలని కోరారు.

నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నారు..

వన్-బి కోసం రైతులు తహసీల్దార్​ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన ఈ నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ గ్రామగ్రామాన రైతులు ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మిషన్​ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నీరందించిన విధంగానే.. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రాయపోల్ మండలం ఆరేపల్లి నుంచి మండల కేంద్రం వరకు రైతులు ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీని మంత్రి హరీశ్​రావు జెండా ఊపి ప్రారంభించారు.

కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్​రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్, ఆర్డీవో విజయేందర్​రెడ్డి, పలువురు తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: ఏడో ఆర్థిక గణాంక సర్వే.. ఉపాధి అవకాశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.