కరోనా వైరస్ ఇంకా అంతం కాలేదని... ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు మాత్రమే చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కరోనా అంతానికి ప్రభుత్వ సూచనలు పాటించాలని తెలిపారు. మాస్కలు తప్పనిసరిగా పెట్టుకోవాలని.. భౌతికదూరం పాటించాలని పేర్కొన్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. సిద్దిపేటలో ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు.
కరోనాపై నిర్లక్ష్యం వద్దు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలి. లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ఒక్కొక్కరికి 12కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1500 ఇస్తున్నారు. కరోనాకు మందు రావడానికి సమయం పడుతుంది. స్వీయ నియంత్రణ పాటించాలి.
- హరీశ్ రావు, ఆర్థిక మంత్రి
ఇదీ చదవండి: బాధ్యతను ఒకరు గుర్తు చేయాల్సిన అవసరమేంటి..?