కాల్వల భూసేకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట కొండా భూదేవి గార్డెన్స్‌లో నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట రూరల్‌లో 209 మందికి, సిద్దిపేట అర్బన్‌లో 305 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
కాళేశ్వరం నీళ్లు వచ్చాక రైతులతో జరుగుతున్న మొదటి సమావేశంలో మంత్రి హరీశ్ ఈ పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని సిద్దిపేట రూరల్, అర్బన్ మండలాలు మినహా అన్నీ మండలాలకు కాళేశ్వరం జలాలు వచ్చాయన్నారు. త్వరలోనే రూరల్, అర్బన్ మండలానికి మల్లన్న సాగర్ నీళ్లు తెస్తామని హామీనిచ్చారు. రైతులు కూడా పెద్ద మనసుతో కాల్వలు, పిల్ల కాల్వల భూ సేకరణకు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఎంతోమంది రైతుల త్యాగాల ఫలితమే ఈ కాళేశ్వరమని చెప్పారు. తెరాస పాలనలో రైతు రాజ్యం వచ్చిందని మంత్రి వెల్లడించారు.
ఇదీ చూడండి : ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే!