ETV Bharat / state

'ఒక్క రూపాయి లంచం ఇచ్చినట్లు నిరూపిస్తే... 10 వేల రివార్డు' - harish rao latest news

సిద్దిపేటలోని కేసీఆర్​నగర్​లో ఏడవ విడతలో 216 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఎంపికలో ఒక్క రూపాయి లంచం ఇచ్చినట్లు నిరూపిస్తే... 10 వేల రివార్డు ఇస్తానని మంత్రి ప్రకటించారు. ఇచ్చిన ఇండ్లు అమ్మినా... కిరాయికి ఇచ్చినా... కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

'ఒక్క రూపాయి లంచం ఇచ్చినట్లు నిరూపిస్తే... 10 వేల రివార్డు'

author img

By

Published : Jan 6, 2021, 4:25 PM IST

'ఒక్క రూపాయి లంచం ఇచ్చినట్లు నిరూపిస్తే... 10 వేల రివార్డు'

రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఒక్క రూపాయి లంచం ఇచ్చినట్లు నిరూపిస్తే... 10 వేల రివార్డు ఇస్తానని మంత్రి ప్రకటించారు. సిద్దిపేటలోని కేసీఆర్​నగర్​లో ఏడవ విడతలో 216 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు.

హైదరాబాద్​లోని గెటెడ్ కమ్యూనిటీ తరహాలో సకల సౌకర్యాలతో ఇండ్లు నిర్మించామని మంత్రి పేర్కొన్నారు. తమ కాలికి మట్టి అంటకుండా ఇండ్లు నిర్మించి ఇస్తున్నామన్న మంత్రి... ఇచ్చిన ఇండ్లను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. దోమల బెడద, ఈగలు లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించమన్నారు. రెండున్నరేళ్లలో సుమారు 400 సార్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే... ఈ రూపం వచ్చిందని వివరించారు.

ఇచ్చిన ఇండ్లు అమ్మినా... కిరాయికి ఇచ్చినా... కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మిగిలిన అర్హులైన వారందరికీ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీక సిద్దిపేట డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అని తెలిపారు.

ఇదీ చూడండి: గర్భవతి అని చూడకుండా కోడలిని హింసించిన అత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.