ETV Bharat / state

'సర్పంచ్​ల గురించి మాట్లాడే హక్కు బండి సంజయ్​కు లేదు' - Minister Harish Rao Comments On Bandi Sanjay

Harish Rao On Bandi Sanjay: కేంద్ర ప్రభుత్వంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణపై వివక్ష చూపుతోందని మండిపడ్డారు. నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రంలో సర్పంచ్​ల గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్​కు లేదన్నారు.

Harish
Harish
author img

By

Published : Jun 14, 2022, 6:21 PM IST

Harish Rao On Bandi Sanjay: సర్పంచ్​ల గురించి మాట్లాడే హక్కు బండి సంజయ్​కు లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. భాజపా నాయకులు ఏ ముఖం పెట్టుకుని గ్రామాల్లో తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఇప్పటికే మూడు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా... కేంద్రం స్పందించడం లేదని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి మంత్రి హరీశ్​ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.

కేంద్రంపై విమర్శలు గుప్పించిన హరీశ్​... రూ.1,400 కోట్ల ఉపాధి హామీ బిల్లులు చెల్లించకుండా నిలిపివేశారని మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి రూ.9వేల కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉన్నా... ఎందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని పార్టీ భాజపా అని ధ్వజమెత్తారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాకుండా చేసిన ఘనత భాజపాదే అని మండిపడ్డారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని నిలదీశారు. తెలంగాణలో ఉద్యోగ నియామకాలు భర్తీ చేస్తున్నామని ప్రకటించారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్తోంది. మీటర్లు పెడితే రూ.25 వేల కోట్లు ఇస్తామని ఆశ చూపింది. కేసీఆర్‌ మాత్రం మీటర్లు పెట్టేది లేదని కరాఖండిగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఎఫ్‌సీఐ బియ్యం కొనకుండా రైసు మిల్లులపై దాడులు చేయించారు. హక్కుగా రావాల్సిన ఎఫ్‌ఆర్‌బీఎం నిధులను కేంద్రం ఆపేసింది. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీని భాజపా ఆపేసింది. వైద్య కళాశాలలు, నవోదయ పాఠశాలలు మంజూరు చేయట్లేదు. మనకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్‌కు తీసుకెళ్లారు. కేంద్రంలోని 16 లక్షల ఉద్యోగాల భర్తీ గురించి భాజపా చెప్పాలి. -- హరీశ్‌రావు, మంత్రి

'సర్పంచ్​ల గురించి మాట్లాడే హక్కు బండి సంజయ్​కు లేదు'

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.