ETV Bharat / state

'నర్సింహులు విషయంలో ప్రతిపక్షాలవి శవ రాజకీయాలు'

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని వేలూరులో ఎస్సీ రైతు నర్సింహులు మృతి దురదృష్టకరమని మంత్రి హరీశ్​రావు సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్వలాభం కోసం అమాయకులను బలి పశువులుగా చేసి విపక్షాలు రాజకీయ ప్రేరేపిత హత్యలకు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు.

minister harish rao comment on farmer narsimlu death

author img

By

Published : Jul 30, 2020, 9:12 PM IST

రైతుల నుంచి అధికారులు బలవంతంగా భూములు లాక్కున్నారని ప్రతిపక్షాలు ఆరోపించడం సిగ్గుచేటని ఆర్థిక మంత్రి హరీశ్​రావు విమర్శించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు నర్సింహులు భూమిని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ సబ్​స్టేషన్​ నిర్మాణం కోసం స్వాధీనం చేసుకున్నారని నిజాలు తెలిసి కూడా ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. స్వలాభం కోసం అమాయకులను బలి పశువులుగా చేసి విపక్షాలు రాజకీయ ప్రేరేపిత హత్యలకు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు.

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని వేలూరులో ఎస్సీ రైతు నర్సింహులు మృతి దురదృష్టకరమని... ఈ ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధిత రైతు కుటుంబానికి ఎక్స్​గ్రేషియాతో పాటు ఎకరం భూమి తక్షణ సాయం కింద రెండు లక్షల రూపాయలు, మృతుని పిల్లలకు, ప్రభుత్వ ఖర్చుతో విద్యను అందిస్తామని మంత్రి హరీశ్​రావు తెలిపారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.