ETV Bharat / state

మీ "కోటి కొలువులు" ఏమయ్యాయి?: మంత్రి హరీశ్​ రావు - తెలంగాణ తాజా వార్తలు

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట, బల్వంతాపూర్‌లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి మంత్రి హరీశ్​రావు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుబ్బాక గెలుపు బాధ్యతలు భూజానికెత్తుకున్న మంత్రి హరీశ్ రావు.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

మీ "కోటి కొలువులు" ఏమయ్యాయి?: మంత్రి హరీశ్​ రావు

author img

By

Published : Oct 24, 2020, 6:50 AM IST

Updated : Oct 24, 2020, 7:31 AM IST

ప్రధాని నరేంద్రమోదీ దేశంలో ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తామన్నారు.. ఆరేళ్లలో ఆరు కోట్ల ఉద్యోగాలివ్వాలి కదా.. దీనిపై లెక్కలు చెబుతారా?’ అని మంత్రి హరీశ్‌రావు భాజపా నేతలను ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట, బల్వంతాపూర్‌లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాము లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకున్నామని.. ఇప్పటికే 1.24 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, మరో 30,000 ఉద్యోగాల నియామకం వివిధ దశల్లో ఉందని చెప్పారు. భాజపా అంటే ‘భారతీయ జూటా పార్టీ’గా మారిందని విమర్శించారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు, జీఎస్టీ విధించి ఆ రంగాన్ని కుదేలు చేసిన భాజపాకు ఓటేస్తారా? దేశంలో ఎక్కడాలేని విధంగా నెలకు రూ. 2,016 జీవనభృతి ఇస్తున్న తెరాసకు ఓటు వేస్తారా? అని ఓటర్లను ప్రశ్నించారు. భాజపా నేతలు పేర్కొన్నట్టు కేసీఆర్‌ కిట్‌ పథకంలో కేంద్ర వాటా ఒక్క పైసా లేదన్నారు.

బిహార్‌కే టీకాలు ఉచితమా..

బిహార్‌ ఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థుల గెలుపు కోసం కరోనా టీకాను ఉచితంగా పంపిణీ చేస్తామనడం సిగ్గుచేటని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మిరుదొడ్డిలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. బిహార్‌ రాష్ట్రానికే ఉచితంగా పంపిణీ చేస్తారా.. తెలంగాణకు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇవ్వరా అని ప్రశ్నించారు. ఓటర్లను మభ్య పెట్టడానికి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం దుర్మార్గమని విమర్శించారు.

మీ "కోటి కొలువులు" ఏమయ్యాయి?: మంత్రి హరీశ్​ రావు

ఇదీ చూడండి: 'అన్నదాతలు నష్టపోవద్దనే మక్కలు కొంటున్నాం'

Last Updated : Oct 24, 2020, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.