Harish Rao on Telangana Police : సిద్దిపేట పట్టణంలో రూ.10 కోట్లతో నిర్మించిన మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ.కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ ఫారూక్ హుస్సేన్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్.
పెట్రోల్ బంక్‌లకు త్వరలోనే స్థలాల గుర్తింపు..
Harish Rao on Police : పోలీస్ శాఖకు మంజూరైన పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు అనువైన స్థలాలను త్వరలోనే గుర్తిస్తామని చెప్పారు. అంతకుముందు.. సిద్దిపేట శివారు నాగులబండ వద్ద 19.44 కోట్ల వ్యయంతో నిర్మించిన హరిత త్రీ స్టార్ టూరిజం హోటల్‌ను హరీశ్ రావు ప్రారంభించారు. టూరిజం హోటల్ ప్రక్కనే వందలాది మందికి ఉపాధినిచ్చే ఐటీ టవర్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు.
నా కలకు ప్రతిరూపం..
Model Police Convention Center : "రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేసే శాఖ పోలీస్ శాఖనే. ఇలాంటి పోలీసులకు ఏదైనా చేయాలనే ఆలోచన నాకుండేది. నా కలల ప్రతిరూపమే మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్. సీపీ జోయల్ డేవిస్ సారథ్యంలో నా కల సాకారం అయింది. మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ద్వారా వచ్చే ప్రతి రూపాయి పోలీసుల సంక్షేమానికే వెచ్చిస్తాం. ఇది తొలి అడుగు మాత్రమే. ప్రతి జిల్లాలో ఇలాంటి సెంటర్ నిర్మిస్తాం. తెలంగాణ పోలీసులు తమ పనితీరుతో దేశవ్యాప్తంగా పేరు పొందారు. ఎంత క్లిష్టమైన కేసు అయినా.. ఆధునిక సాంకేతికతతో వీలైనంత త్వరగా పరిష్కరించే సత్తా మన పోలీసులకు ఉంది."
- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి
తెలంగాణ పోలీసే నంబర్ వన్..
Minister Mahmood Ali : మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవతోనే ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం వేగంగా పూర్తైందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు నంబర్ వన్ అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీసులంటే ప్రజలకు భయముండేదని.. కానీ తెలంగాణ వచ్చాక ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు నమ్మకం కలిగిందని చెప్పారు. లా అండ్ ఆర్డర్ బాగుండటం వల్లే తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.