ETV Bharat / state

చందాపూర్​లో తెరాస కార్యకర్తల సమావేశం

సిద్దిపేట జిల్లా చందాపూర్​లో తెరాస కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తెరాస పార్టీ కొండపాక మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

author img

By

Published : Sep 14, 2020, 9:46 PM IST

meeting-of-teresa-activists-in-chandapur
చందాపూర్​లో తెరాస కార్యకర్తల సమావేశం

సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్​లో తెరాస కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తొగుట మండల ఎన్నికల ఇంఛార్జ్, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ కొండపాక మండల అధ్యక్షులు నూనె కుమార్​ యాదవ్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడం చాలా బాధాకరమని నూనె కుమార్ యాదవ్​ పేర్కొన్నారు. రానున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ టికెట్​ ఎవరికి కేటాయించినా.. అందరూ కలిసికట్టుగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. గ్రామాలను అభివృద్ధి చేసుకొని బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలన్నారు.

కార్యక్రమంలో పలువురు మండల నాయకులు, చందాపూర్ గ్రామ సర్పంచ్ బొడ్డు నర్సింలు యాదవ్, తెరాస పార్టీ గ్రామ అధ్యక్షుడు జనగామ సుభాష్ గౌడ్, ఉప సర్పంచ్ రామచంద్రం, మాజీ సర్పంచులు నర్సట్టి మల్లేశం యాదవ్, సిరిసిల్ల భాస్కర్, నాయకులు కుమార్ రెడ్డి, స్వామి, ధర్మయ్య, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.. వ్యవసాయ బిల్లులపై రైతులకు కేంద్రం భరోసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.