ETV Bharat / state

అప్పుడు చేయని అభివృద్ధి.. ఇప్పుడెలా చేస్తారు: పద్మాదేవేందర్​ రెడ్డి

70 ఏళ్లు పరిపాలించనప్పుడు చేయలేని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారని ప్రతిపక్షాలపై మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రశ్నించారు. భాజపా, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, కల్యాణ లక్ష్మి, ఉచిత కరెంటు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. తమ అభ్యర్థి సోలిపేట సుజాత విజయం ఎప్పుడో ధీమా వ్యక్తం చేశారు.

అప్పుడు చేయని అభివృద్ధి.. ఇప్పుడెలా చేస్తారు: పద్మాదేవేందర్​ రెడ్డి
అప్పుడు చేయని అభివృద్ధి.. ఇప్పుడెలా చేస్తారు: పద్మాదేవేందర్​ రెడ్డి
author img

By

Published : Oct 29, 2020, 8:03 PM IST

70 ఏళ్లు పరిపాలించనప్పుడు చేయలేని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారని ప్రతిపక్షాలపై మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రశ్నించారు. వానకాలం ఉసిల్లు వచ్చినట్లు ఎన్నికలు రాగానే ప్రతిపక్ష నాయకులు గ్రామాల్లోకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

medak-mla-padma-devendar-reddy-election-campaign-in-doulthabad-mandal-of-siddipeta-district
అప్పుడు చేయని అభివృద్ధి.. ఇప్పుడెలా చేస్తారు: పద్మాదేవేందర్​ రెడ్డి

గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేం చేస్తుందని.. ఓట్లు అడగటానికి గ్రామాల్లోకి వస్తున్నారని పద్మా దేవేందర్​ రెడ్డి ప్రశ్నించారు. భాజపా, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, కల్యాణ లక్ష్మి, ఉచిత కరెంటు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు.

ప్రజలంతా చైతన్యంతో ఉన్నారని.. అభివృద్ధి చేసే తెరాస వైపు ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు. తమ అభ్యర్థి సోలిపేట సుజాత విజయం ఎప్పుడో ఖరారైందని పద్మా దేవేందర్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: మంత్రిగా దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది: హరీశ్​రావు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.