సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట ప్రాథమిక పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఎంపీడీవో సత్యపాల్, సర్పంచ్ ఇర్రి లావణ్య ప్రారంభించారు. మండలంలోని వివిధ ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు విభిన్న రకాల నమూనాలను తయారు చేసి ప్రదర్శనలో పెట్టారు.
ప్రదర్శనలో ఉంచిన పలు నమూనాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీటీసీ, కో ఆప్షన్ సభ్యుడు, ఉపసర్పంచ్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్