ETV Bharat / state

కేసీఆర్​ ఫామ్​హౌస్​కే పరిమితం కావాల్సి వస్తది: మంద కృష్ణ - కేసీఆర్​పై మంద కృష్ణ మాదిగ ఘాటు వ్యాఖ్యలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్​ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపకుడు హాజరై సంఘీభావం తెలిపారు. వెంటనే చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేసీఆర్​ ఫామ్​హౌస్​కే పరిమితం కావాల్సి వస్తది
author img

By

Published : Nov 2, 2019, 7:25 PM IST

ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేపట్టకపోతే... కేసీఆర్​ ప్రగతి భవన్​ వీడి ఫామ్​హౌస్​కే పరిమితం కావాల్సివస్తుందని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​-ప్రజ్ఞాపూర్​ డిపో వద్ద​ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సాధ్యం కాదని చెప్తున్న కేసీఆర్​... ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వాన్ని చూసైన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. దినదిన గండంగా బతుకుతున్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి... ప్రభుత్వాన్ని బేషజాలు వీడాలని కోరారు.

కేసీఆర్​ ఫామ్​హౌస్​కే పరిమితం కావాల్సి వస్తది

ఇవీ చూడండి: రాజులేలిన రాచకొండలో దాగున్న జలపాతాలు

tg_srd_16_02_rtc_sangeevham_mandha_krishna_av_ts10054.mp4 Ashok Gajwel యాంకర్ : కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేపట్టకపోతే ప్రగతి భవన్ వీడి ఫామ్ హౌస్ కే పరిమితం కావాల్సి వస్తుందని హెచ్చరించారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ ప్రపంచం ఉన్నన్ని రోజులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం జరపడం సాధ్యం కాదని చెప్పిన కేసీఆర్ కి ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్టీసీ విలీనం చెంపపెట్టని ఆయన తెలిపారు. అవహేళనగా మాట్లాడిన కేసీఆర్ తీరుని సవాల్ గా తీసుకొని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆర్టీసీ విలీనం త్వరగా చేస్తామని చెప్పిన మాటకైనా కేసీఆర్ తీరు మారాలని ఆయన పేర్కొన్నారు.దిన దిన గండంగా బ్రతుకుతున్న ఆర్టీసి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ బేష జలాలు విడనాడి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం తో పాటుగా 26 డిమాండ్ల పై తక్షణమే ప్రభుత్వం చర్చలు జరపాలి ఆయన ప్రభుత్వానికి ఆయన సూచించారు. BYTE : మంద కృష్ణ మాదిగ(ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు)

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.