ETV Bharat / state

స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటకు సంకల్పిద్దాం - స్వచ్ఛ ఆరోగ్యం

స్వచ్ఛ ఆరోగ్య సిద్ధిపేట వైపు అడుగులేద్దామని ఎమ్మెల్యే హరీశ్​ రావు పిలుపునిచ్చారు. స్వచ్ఛత, ఆరోగ్యం పై సిద్ధిపేట ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటూ నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్​లు, పలువురు అధికారులతో జరిగిన అవగాహన సదస్సులో దిశానిర్దేశం చేశారు.

స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటకు సంకల్పిద్దాం
author img

By

Published : Aug 27, 2019, 1:34 PM IST

స్వచ్ఛత వైపుగా చైతన్య బాట పట్టేలా.. స్వచ్ఛ ఆరోగ్య సిద్ధిపేటకు సంకల్పిద్దామని ఎమ్మెల్యే హరీశ్​ రావు పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్​లు పలువురు గ్రామ స్థాయి అధికారులకు హరీశ్ రావు మార్గ నిర్దేశం చేశారు. మన ఆరోగ్యం.. మన చేతుల్లో ఉందని స్వచ్ఛ ఆరోగ్య సిద్ధిపేటకు మేము సైతమని ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. భూమిపై బురద నీరు లేకుండా ఉంటేనే రోగాలు రాకుండా ఉంటాయని వివరించారు. స్వచ్ఛతకై స్వచ్ఛత కమిటీలు, ఇంటికో వేప చెట్టు కై హరిత కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామంటూ ప్రజలచేత ప్రతిజ్ఞ చేయించారు.

స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటకు సంకల్పిద్దాం

ఇదీ చూడండి:'సాగు... సంక్షేమానికే అధిక ప్రాధాన్యం'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.