సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్ అటవీ ప్రాంతంలోని 458 సర్వే నంబర్ పంట పొలంలో నిన్న సాయంత్రం అనుమానాస్పద స్థితిలో చిరుత పులి మృతి చెందింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా అటవీశాఖ, పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో మండల పశువైద్యాధికారిని మంజుల పోస్టుమార్టం నిర్వహించారు. చిరుత మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను సేకరించిన వైద్యులు… మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి ల్యాబ్‌కు తరలించారు.
పోస్టుమార్టం అనంతరం అక్కడే పులి మృతదేహానికి దహనసంస్కారాలు నిర్వహించారు. ఈ అటవీ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ చిరుత పులి కనిపించలేదని జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ రావు తెలిపారు. చేగుంట వైపు నుంచి పులి ఇక్కడికి వచ్చి ఉంటుందని.. త్వరలోనే దాని మృతికి గల కారణాలు తెలుసుకుంటామని వివరించారు.
ఇవీ చూడండి: లాక్డౌన్ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్