సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కొవిడ్-19 కారణంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలన్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కార్మిక చట్టాలను రద్దు చేయడం, కనిసవేతనాలు అమలు కాకపోవడం, ఉద్యోగాలు నుంచి తొలగింపు, వేతనాలు కోతలు విధించడం లాంటి విధానాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.