సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట జిల్లా అల్వాల వద్ద కూడవెల్లి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. భారీ వర్షానికి వాగు ఉగ్రరూపం దాల్చడం వల్ల చెక్ డ్యాములన్నీ.. పొంగి పొర్లుతున్నాయి. 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. కూడవెల్లి వాగు నాలుగు సంవత్సరాల తర్వాత నిండుకుండను తలపిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. సెల్ఫీలు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇవీ చూడండి: హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం