సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని చందాపురం గ్రామం వద్ద గల కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూడవెల్లి వాగుకు భారీగా వరద నీరు చేరింది. చందాపూర్ గ్రామ శివారులోని వాగుగడ్డ చౌరస్తా వద్ద దుబ్బాక-గజ్వేల్ రహదారిలో గల పాత వంతెన పైనుంచి వాగు వేగంగా ప్రవహిస్తున్నది. మరోవైపు కూడవెల్లి వాగుతో లింక్ అయి ఉన్న డ్యాములు నిండి పొంగి పొర్లుతున్నాయి. మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ శివారులోని సిద్దిపేట వెళ్లే మార్గంలో వంతెనపై నుంచి వాగు వేగంగా ప్రవహిస్తుంది.
పరిస్థితిని సమీక్షించిన మిరుదొడ్డి ఎస్సై శ్రీనివాస్ అల్వాల గ్రామ శివారులోని వంతెనపై రెండు వైపులా ముళ్లకంచెలు ఏర్పాటు చేసి వంతనపై నుంచి రాకపోకలు బంద్ చేయించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూడవెల్లి వాగు ఉగ్రరూపం దాలుస్తుందని.. వాగు ఉధృతి తగ్గేవరకు ఇటువైపుగా ప్రయాణం చేయవద్దని ఎస్సై సూచించారు.
ఇదీ చూడండి : 'మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మహానగరం'