కొమురవెల్లి మల్లన్నకు కోటి దండాలు.. కొండపోచమ్మకు ముక్కోటి దండాలు.. అంటూ సాగే కొండపోచమ్మ జాతర భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుగుతోంది. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్‌లో జరిగే ఈ జాతరకు మొదటి మంగళవారం భక్తులు భారీగా తరలి వచ్చారు. కొత్త కుండలో నైవేద్యం చేసి.. డప్పు చప్పుళ్ల నడుమ అమ్మవారికి భక్తులు సమర్పించారు.
పూనకాలతో ఊరేగింపుగా అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలిసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్పవల్లిగా పిలుచుకొనే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3నెలల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి.
ఇదీ చూడండి: అంగరంగ వైభవంగా కొండపోచమ్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభం