కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల్లోని మొదటి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తారు. హైదరాబాద్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు అందుకే... పట్నం వారమని అంటారు. శనివారం వచ్చే పట్నం వాసులు సోమవారం సాయంత్రం వరకు ఇక్కడే బస చేస్తారు.
ఆదివారం స్వామివారి దర్శించుకోవడం, బోనాలు, నైవేద్యం సమర్పించి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక సోమవారం హైదరాబాద్ భక్తుల ఆధ్వర్యంలో పెద్దపట్నం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహిస్తారు. సుమారు యాభై వేలకు పైగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: కరోనా టీకా పంపిణీపై సైకత శిల్పం