రేపు లోక్ సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో గులాబీ బాస్ సతీ సమేతంగా వెళ్లి ఓటు వేయనున్నారు. స్వగ్రామానికి కేసీఆర్ హెలిక్యాప్టర్లో వెళ్లనున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ పనులు, చుట్టుపక్కల ఏర్పాటు చేసిన బారికేడ్లను ఎమ్మెల్యే హరీశ్ రావు... డీసీపీ నర్సింహారెడ్డితో కలిసి పరిశీలించారు. ఓటు వేసిన అనంతరం ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ లో హైదరాబాద్ చేరుకోనున్నారు.
ఇవీ చూడండి: ఓటేద్దాం..ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం..