నెలరోజుల్లో చింతమడకలో సమస్యలు లేకుండా చేయాలని కలెక్టర్, ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆరోగ్య సూచికకు చింతమడక నుంచే నాంది కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. చింతమడక నుంచి విడిపోయి నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పడిన అన్ని గ్రామల ప్రజలకు ఈ లబ్ధి అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల లబ్ధి చేకూరాలన్నారు. అందుకు కావాల్సిన నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరు ఏ ఉపాధి మార్గం ఎంచుకున్నా అభ్యంతరం లేదన్నారు. 2 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నా...కార్తీక మాసంలో చింతమడకలో గృహప్రవేశాలు జరగాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి;హైదరాబాద్ వచ్చేందుకు వణికిపోతున్న డ్రగ్స్ సరఫరా ముఠాలు