తెలంగాణ రాజకీయాల్లోకి ఆరంగ్రేటం చేస్తున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల(YS Sharmila) ఇవాళ కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలకు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ములుగు మండలం ఒంటిమామిడి కూరగాయల మార్కెట్ ముందు ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అదే విధంగా రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించారు. ఈ తరుణంలో కార్యకర్తలు, అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు పెద్ద ఎత్తున చేరుకుని ఫొటోలు దిగారు.
ఇదీ చూడండి: అగ్ని ప్రమాదం- 18 మంది మృతి