ETV Bharat / state

తొలి ప్రధాని నెహ్రూకు ఘన నివాళి - నెహ్రూ వర్ధంతి

నెహ్రూ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కాంగ్రెస్​ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమం కోసం ఆస్తిపాస్తులను అమ్ముకున్న గొప్ప నేతని కీర్తించారు.

jawaharlal nehru death anniversary today
తొలి ప్రధాని నెహ్రూకు ఘన నివాళి
author img

By

Published : May 27, 2020, 5:20 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మాజీ ప్రధాని దివంగత జవహర్ లాల్ నెహ్రూ 56వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. కౌన్సిలర్ చిత్తారి పద్మ నెహ్రూ విగ్రహ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. అనంతరం నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ మొట్టమొదటి ప్రధాని దివంగత జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్య్ర ఉద్యమం కోసం తన ఆస్తి పాస్తులను కూడా అమ్ముకొన్న గొప్ప వ్యక్తి అని డీసీసీ అధికార ప్రతినిధి కెడం లింగమూర్తి అన్నారు.

1956లో ఆంధ్రలో తెలంగాణ కలవడం ఇష్టం లేదని అప్పటి ప్రధాని నెహ్రూ పరోక్షంగా చెప్పారన్నారు. తెరాస ప్రభుత్వం ఇలాంటి గొప్ప నాయకుల పేర్లను రూపుమాపడానికే వారి జయంతి వర్ధంతి ఉత్సవాలను నిర్వహించడం లేదని ఆరోపించారు.

ఇవీ చూడండి: 'నియంత్రిత సాగు'తో విప్లవాత్మక మార్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.