తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ అద్భుతంగా ఉందని.. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి కార్యదర్శి సునీల్ కుమార్ అభినందించారు. ఈ పథకం అమలుపై ఝార్ఖండ్ ప్రభుత్వం ఆసక్తిగా ఉండటం వల్ల ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలనకు గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఎర్రవల్లి, ప్రజ్ఞాపూర్‌లో మిషన్ భగీరథ నల్లాలను పరిశీలించారు.
నీటి సరఫరా, నాణ్యతపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రవల్లి, ములుగులో నిర్మించిన రెండు పడగ గదుల ఇళ్లను పరిశీలించారు. అనేక పట్టణాల కంటే ఎర్రవల్లి గ్రామంలో మౌలికవసతులు బాగున్నాయని సునీల్ కుమార్ పేర్కొన్నారు.
ఇవీచూడండి: కాళేశ్వరం నీళ్లతో... అమరవీరులకు 'జల నీరాజనం