సిద్దిపేట జిల్లా మద్దూరులో బుధవారం ఎంపీపీ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కల్యాణలక్ష్మి, పట్ట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశం ముగింపు దశలో కూటిగల్ నల్ల చెరువును గోదావరి నీళ్లతో నింపాలని, అది నిండితే తమ బోరుబావుల్లో నీళ్లు ఉంటాయని కొండాపూర్‌కు చెందిన పలువురు రైతులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు.
కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే బాధిత రైతులపై మండిపడ్డారు. సర్పంచి ఎన్నికల్లో డబ్బులు తీసుకొని తప్పు చేశారు.. కాబట్టి నీళ్లు రావుపో... తప్పు ఒప్పుకోండని ఒంటికాలిపై లేచారు. తప్పులు చేయకుండా బతకాలన్నారు. తాను ప్రభుత్వాన్ని అడిగి ఏడాదికి రెండు పంటలకు సరిపోను నీళ్లందిస్తానని తెలిపారు. కలెక్టరు, మంత్రి స్థాయిలో కొట్లాడి చెరువులకు నీళ్లు అందిస్తానని అన్నారు.