ETV Bharat / state

తెరాసలో అంతర్మథనం.. భూసేకరణ ప్రభావం చూపిందా?

author img

By

Published : Nov 13, 2020, 8:02 AM IST

దుబ్బాక ఉపఎన్నికలో ఎదురైన ఓటమితో తెరాసలో అంతర్మథనం మొదలైంది. ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషిస్తోంది. నాలుగైదు కారణాలను చెబుతున్న పార్టీ నాయకులు, ఇందులో భూసేకరణ కూడా ఓ ప్రధానాంశంగా పేర్కొంటున్నారు.

Is land grabbing the reason for trs defeat in the Dubaka by-election?
తెరాసలో అంతర్మథనం.. భూసేకరణ ప్రభావం చూపిందా?

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమిపై తెరాసవర్గాలు లోతుగా విశ్లేషిస్తున్నాయి. నాలుగైదు కారణాలను చెబుతున్న పార్టీ నాయకులు, ఇందులో భూసేకరణ కూడా ఓ ప్రధానాంశంగా పేర్కొంటున్నారు. కాళేశ్వరం పథకం ద్వారా దుబ్బాక నియోజకవర్గంలో సుమారు లక్షా ఇరవై వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరందుతుంది. ఇందులో కొన్ని మండలాలకు మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి, మరికొన్ని మండలాలకు కొండపోచమ్మ రిజర్వాయర్‌ ద్వారా నీరు చేరుతుంది.

మల్లన్నసాగర్‌ వల్ల 8 గ్రామాల్లో 8,915 కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. భూసేకరణ మొదలుకొని పరిహారం, పునరావాసం ప్రధాన సమస్యగా మారింది. ఆందోళనలు తీవ్రమై, కోర్టుల్లో కేసుల వరకు వెళ్లింది. వాటిని అధిగమించిన తర్వాత డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వల పనులకు భూసేకరణ ప్రారంభమైంది. రిజర్వాయర్ల నిర్మాణానికి పరస్పర అంగీకారం పద్ధతిలో ధర నిర్ణయించి చెల్లించిన నీటిపారుదల శాఖ డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాల్వల విషయంలో మాత్రం భూసేకరణ చట్టం ప్రకారం చేయాలని నిర్ణయించింది. భూసేకరణ తప్పనిసరి చేస్తూ అధికారులు కొన్ని గ్రామాల్లో రైతులకు నోటీసులు ఇచ్చారు.

దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్‌ ద్వారా 55,000 ఎకరాలు, మల్లన్నసాగర్‌ సమాంతర కాల్వ ద్వారా 23,591 ఎకరాలు, కొండపోచమ్మ ద్వారా 42,796 ఎకరాలకు నీరందుతుంది. మల్లన్నసాగర్‌ నుంచి నీరందే ఆయకట్టు కోసం పిల్లకాల్వకు సుమారు 2,000 ఎకరాలు అవసరం కాగా, కొండపోచమ్మ నుంచి, సమాంతర కాల్వ నుంచి నీరందే మిగిలిన ఆయకట్టుకు 2,500 ఎకరాలకు పైగా అవసరం. అధికారులు రిజిస్ట్రేషన్‌ శాఖ వద్ద మార్కెట్‌ ధరను పరిగణనలోకి తీసుకొని భూ సేకరణ కింద కొన్ని గ్రామాల్లో రైతులకు నోటీసులు ఇచ్చారు. దీనిప్రకారం రైతుకు ఎకరాకు రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షలకు మించి రాదు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తర్వాత ఈ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఎకరా రూ. 15 లక్షలకు పైగా ఉంది. గతంలో పరస్పర ఒప్పందం ప్రకారమే రూ. ఐదారు లక్షల వరకు ఇవ్వగా, ఇప్పుడు అందులో సగం కూడా రాకపోవడం రైతుల్లో చర్చనీయాంశంగా మారిందని తెరాసవర్గాలే పేర్కొంటున్నాయి. గతంలో ఇచ్చిన దానికంటే తక్కువ పరిహారం ఇస్తున్నారనే ప్రచారం అన్ని గ్రామాలకూ పాకి.. ఎన్నికల్లో ప్రభావం చూపిందని నియోజకవర్గంలో కీలకంగా పని చేసిన ముఖ్యనాయకుడొకరు వ్యాఖ్యానించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.