ETV Bharat / state

తెలంగాణ వచ్చాక ఉప ఎన్నికల్లో తొలిసారి తెరాసకు చేదు అనుభవం - tr's defeat in the Dubaka election

దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అనూహ్యంగా పరాజయం పొందింది. శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానంలో తప్పనిసరిగా విజయం సాధిస్తామని భావించినా ఫలితం దక్కకపోవడం పార్టీని నిరాశపరిచింది. ఓటమిపై అంతర్మథనం మొదలైంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన త్వరలో ఓటమిపై సమీక్ష జరగనుంది.

Introspection in trs with Dubaka by-election defeat
తెలంగాణ వచ్చాక ఉప ఎన్నికల్లో తొలిసారి తెరాసకు చేదు అనుభవం
author img

By

Published : Nov 11, 2020, 8:17 AM IST

తెరాసకు బలమైన స్థానాల్లో దుబ్బాక ఒకటి. కేసీఆర్‌ సొంత జిల్లాలో ఆది నుంచి విజయాలు సాధించింది. 2014 ఎన్నికల్లో 37,925, 2018లో 62,500 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ దుబ్బాక సెగ్మెంటులో కాంగ్రెస్‌పై తెరాస 52,478 ఆధిక్యం సాధించింది. అనారోగ్యంతో రామలింగారెడ్డి చనిపోగా.. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా కుటుంబ సభ్యులకే టికెట్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రామలింగారెడ్డి కుమారుడు టికెట్‌ ఆశించినప్పటికీ పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత కారణంగా రామలింగారెడ్డి భార్య సుజాతను బరిలో నిలిపారు. ఆది నుంచి బలంగా ఉండడం, సీఎం సొంత జిల్లా కావడంతోపాటు సానుభూతి కూడా కలిసొస్తుందని పార్టీ అంచనా వేసింది.

దుబ్బాకను ఆనుకునే సీఎం నియోజకవర్గమైన గజ్వేల్‌, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేట ఉండటంతో ఉప ఎన్నికలో విజయం ఖాయమనుకున్నారు. మంత్రి హరీశ్‌రావు మొదటి నుంచి ప్రచార బాధ్యతలన్నీ దగ్గరుండి చూసుకున్నారు. దుబ్బాక అభివృద్ధి తన బాధ్యతంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తెరాస నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినా అది తమకేమీ ఇబ్బంది కాకపోవచ్చని పార్టీ భావించింది. భాజపా నుంచి అంత తీవ్రమైన పోటీ ఉండదనుకుంది. క్రమేపీ భాజపా పుంజుకోవడం, ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు దూకుడుగా వ్యవహరించడంతో తెరాస దానిని ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహంతో ముందుకెళ్లింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లభ్ధిదారులపై పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఎన్నికల నాటికి భాజపా గట్టిపోటీదారుగా మారినా.. మెజారిటీ తగ్గుతుందేమో కానీ ఓటమి పాలయ్యేంత ప్రభావం ఉండదని తెరాస బలంగా విశ్వసించింది. అయితే అనూహ్య పరాజయం ఎదురైంది.

పరాజయానికి కారణాలపై అధిష్ఠానం ఆరా

ఫలితాలపై తెరాసలో విశ్లేషణ మొదలైంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ వద్ద, కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ వద్ద దీనిపై చర్చ జరిగింది. ఫలితంపై సీఎం సైతం విస్మయం చెందినట్లు సమాచారం. లెక్కింపు అనంతరం పలువురు నాయకులతో మాట్లాడారని తెలిసింది. కేటీఆర్‌ సైతం స్థానిక నేతల నుంచి సమాచారం తీసుకున్నారు. భాజపా ప్రభావం ఎలా ఉన్నా.. పార్టీకి వ్యతిరేక అంశాలేమిటనే దానిపై అధిష్ఠానం నుంచి ఆరా మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాలలో తెరాసకు తక్కువ ఓట్లు పడ్డాయని పార్టీ వర్గాలు సీఎంకు, కేటీఆర్‌కు వెల్లడించినట్లు తెలిసింది. రామలింగారెడ్డికి వ్యతిరేకవర్గం ఉండడం, స్థానికంగా ఉన్న సమస్యలు, ఇతర అంశాలు కూడా తెరాస ఓటమికి కారణంగా భావిస్తున్నారు. త్వరలో జరిగే గ్రేటర్‌ ఎన్నికలపై ఈ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.