సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ రోజా శర్మ, సిద్దిపేట, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సతీష్, ఎమ్మెల్సీ ఫారుక్, సంయుక్త కలెక్టర్ పద్మాకర్ పాల్గొన్నారు.
భారత జాతీయోద్యమ స్ఫూర్తితో అహింస మార్గంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని స్పీకర్ తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, హరితహారం వంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి: ఎర్రకోటపై మోదీకి రెండో అతిపెద్ద ప్రసంగం