రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని సోసైటీల్లో యూరియా అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అధికారులకు సూచించారు. కో- ఆపరేటీవ్ సొసైటీ, మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు.. యూరియా కొరత లేదని రైతులకు విశ్వాసం కలిగించేలా చెప్పాలన్నారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి, కో- ఆపరేటీవ్ సొసైటీ ఛైర్మన్లు, డీఏఓ శ్రవణ్, మండల వ్యవసాయ శాఖ అధికారులు, మార్క్‌ఫెడ్ అధికారులతో యూరియా కొరతపై హరీశ్ సమీక్ష నిర్వహించారు. కో- ఆపరేటీవ్ సోసైటీల ద్వారా రైతుల వద్దకే లారీలు పంపాలని అధికారిక వర్గాలను ఆదేశించారు. రైతులకు ఖర్చులు తప్పుతాయని, యూరియా పంపిణీ కేంద్రాల వద్ద వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి : రహదారి పూర్తి చేయాలంటూ విద్యార్థుల రాస్తారోకో