ETV Bharat / state

హుస్నాబాద్​లో వడగళ్ల వర్షం...ఆందోళనలో రైతులు - VADAGANDLA VAANA

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో భారీ వడగళ్ల వర్షం కురిసింది. తమ పంట దెబ్బతింటోందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

హుస్నాబాద్​లో భారీ వడగళ్ల వాన
హుస్నాబాద్​లో భారీ వడగళ్ల వాన
author img

By

Published : Mar 20, 2020, 9:59 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం సహా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడింది. ఓ వైపు ఎండలు అధికంగా మండుతూ... రెండు మూడు రోజులుగా ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణం చల్లబడి జిల్లా వాసులకు ఉపశమనం లభించింది.

మరోవైపు వరి, మొక్కజొన్న, మామిడి రైతులు వడగళ్ల వర్షంతో పంటకు నష్టం జరుగుతుందోనని ఆందోళనకు లోనవుతున్నారు. మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని... వాతావరణ శాఖ వెల్లడించింది.

హుస్నాబాద్​లో భారీ వడగళ్ల వాన

ఇవీ చూడండి : ఇంటిపట్టున ఉండమంటే.. ఇదేం పద్ధతి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.