ETV Bharat / state

సిద్దిపేట జిల్లాలో ఈతకు వెళ్లి హైదరాబాద్​ యువకుడి గల్లంతు

కరోనా కారణంగా బయట తిరగలేని పరిస్థితి. పల్లెటూళ్లలో ప్రశాంతమైన వాతావరణంలో గడపాలని వచ్చిన యువకుడు ఊరుగాని ఊళ్లో కన్నవాళ్లకు జాడ రాకుండా పోయాడు. హైదరాబాద్​కు చెందిన కుకట్ల నగేశ్​​ సోమవారం ఈత కోసం బావిలో దిగి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లతో గాలించిన ఫలితం దక్కలేదు.

సిద్దిపేట జిల్లాలో ఈతకు వెళ్లి హైదరాబాద్​ యువకుడి గల్లంతు
సిద్దిపేట జిల్లాలో ఈతకు వెళ్లి హైదరాబాద్​ యువకుడి గల్లంతు
author img

By

Published : May 12, 2020, 11:13 PM IST

హైదరాబాద్ (తుకారం గేట్) జేఎస్ఎల్ నగర్​కు చెందిన కుకట్ల నగేశ్, కడారి మల్లికార్జున్, శివగంగ రఘులు ద్విచక్రవాహనంపై సోమవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గులోని మిత్రుడు కడునూరి రామచంద్రం ఇంటికి వెళ్లారు. నలుగురు కలిసి విందు చేసుకున్నారు. అనంతరం రాత్రి సమయంలో గ్రామానికి సమీపంలోని కరణం బావిలో ఈత కోసం రామచంద్రం, నగేశ్, మల్లికార్జున్ దిగారు.

బావిలో దూకిన నగేశ్​ కొంత దూరం ఈదుతూ నీటిలో మునిగిపోయాడు. కొంత సేపు చూసిన తోటివారు సమీపంలోని గ్రామస్థులతో కలిసి గాలించారు. రాత్రి కావడం వల్ల వీలుకాలేదు. మంగళవారం తెల్లవారుజామున చూసినా మృతదేహం లభ్యం కాలేదు. సమాచారం అందుకుని ఎస్సై మోహన్ బాబు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని, గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. అయినప్పటికీ ఆచూకీ దొరకలేదు. వ్యవసాయ బావి పెద్దదిగా ఉండటం, చెరువు కిందనే ఉండటం వల్ల మోటార్లతో నీటిని తోడినా ఫలితం ఉండదని.. గజ ఈతగాళ్లతోనే గాలింపు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఇవీ చూడండి: ముంబయి నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.