సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా పోలీసులు డ్రోన్‌కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. హుస్నాబాద్‌తో పాటు పక్కనున్న గ్రామాల్లోనూ లాక్డౌన్ అమలును నిరంతరం పరిశీలిస్తున్నారు.
ప్రతిరోజూ డ్రోన్ కెమెరాల ద్వారా హుస్నాబాద్ పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నామని, ఎవరైనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుధాకర్ హెచ్చరించారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.