ETV Bharat / state

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: హుస్నాబాద్ ఏసీపీ

వ్యాపారులు తమ దుకాణాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని హుస్నాబాద్​ ఏసీపీ మహేందర్​ సూచించారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్​ పట్టణంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్​ హాల్​లో నిర్వహించిన అవగాహన సదస్సులో పట్టణ వర్తక, వ్యాపారులకు సీసీ  కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించారు.

author img

By

Published : Sep 25, 2020, 7:57 PM IST

husnabad police meeting with shop owenrs in husnabad town
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి : హుస్నాబాద్ ఏసీపీ

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్​ పట్టణంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్​హాల్​లో పట్టణంలోని వ్యాపారులకు, వర్తకులకు తమ వ్యాపార కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అంశంపై పట్టణ పోలీసులు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని.. ఇప్పటికే బిగించుకున్న వారు.. అవి ఎలా పని చేస్తున్నాయో.. తనిఖీ చేసుకోవాలని ఏసీపీ మహేందర్​ సూచించారు. బతుకమ్మ, దసరా, దీపావళి సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్​ చేసే అవకాశం ఉన్నందున దొంగతనాలు జరిగే అవకాశముందని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వ్యాపారులు నష్టపోయే పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చని ఆయన తెలిపారు.

పట్టణంలో వ్యాపార కేంద్రాలు, పలు కూడళ్లలో పాడైపోయిన సీసీ కెమెరాలను వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. వార్డుల వారిగా సీసీ కెమెరాల పనితీరును త్వరలో పర్యవేక్షించనున్నట్టు ఆయన తెలిపారు. సీసీ కెమెరాల వల్ల ఏ చిన్న ఘటన జరిగినా, నేరాలు చోటు చేసుకున్నా కేసు ఛేదించడం సులువవుతుందని.. ప్రజలకు రక్షణ కల్పించడం సులభమవుతుందని ఏసీపీ అన్నారు.

నేఈ కార్యక్రమంలో కిరాణా సంఘం అసోసియేషన్ అధ్యక్షులు బొల్ల కిష్టయ్య, వర్తక సంఘం అసోసియేషన్ అధ్యక్షులు రాజయ్య, వ్యాపారస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఎనుమాముల మార్కెట్లో మొదలైన పత్తి కొనుగోళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.