సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కేసీఆర్ హెల్త్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి దుబ్బాక జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంఈవో హాజరై విద్యార్థినీలకు కిట్లను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని.. వాటిని సద్వినియోగ పరచుకోవాలన్నారు. పరీక్షల్లో కష్టపడి చదవి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. ఒక్కో కిట్లో 13 రకాల సామగ్రి ఉన్నాయి.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం!