సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు నీటితో నిండుగా ప్రవహిస్తూ మత్తడి పోస్తున్నాయి. హుస్నాబాద్ మండలంలోని రేణుక ఎల్లమ్మ, మీర్జాపూర్ చెరువులు, అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి చెరువు మత్తడి పడుతుండగా గౌరవెల్లి ప్రాజెక్టులో ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీరు నిల్వ ఉండగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
హుస్నాబాద్- సిద్దిపేట ప్రధాన రహదారి వంతెన పైనుంచి బస్వాపర్ వద్ద మోయతుమ్మెద వాగు ప్రవహిస్తుండగా వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీటితో కోహెడ మండలంలోని శనిగరం ప్రాజెక్టు మత్తడి పడుతోంది. చాలా రోజుల తర్వాత ప్రాజెక్టు నిండగా వీక్షకులు మత్తడిపై నుంచి పరవళ్లు తొక్కుతున్న నీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఐదు నెలల్లో కేరళ విమాన ప్రమాదంపై నివేదిక'