ఇంట్లో ఉంటే ఉక్కపోత... బయటకు వస్తే నిప్పుల కుంపటి... ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఉండలేకా... బయటకు రాలేక జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. యువత... వ్యవసాయ బావుల్లో ఈత కొడుతూ ఉపశమనం పొందుతున్నారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన ఓ కుటుంబం వారి సొంత వ్యవసాయ బావిలో పగటిపూట ఈతకొడుతూ కనిపించింది. హైదరాబాద్లో నివాసముండే ఆ కుటుంబం లాక్డౌన్ కారణంగా స్వగ్రామానికి వచ్చారు. యువతీ యువకులందరూ కలిసి సరదాగా ఈత కొట్టారు. మధ్యాహ్న వేళల్లో కుటుంబ సభ్యులతో కలిసి బావిలో ఈత కొడుతూ ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందుతున్నామని కుటుంబసభ్యులు తెలిపారు.