సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయని సీపీ జోయల్ డేవిస్ అన్నారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో కలిపి మొత్తం 2 వేల మంది ఉప ఎన్నిక బందోబస్తులో పాల్గొన్నారని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన చోట అదనపు బలగాలు, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారమన్నారు.
చెదురుమొదురు ఘటనలు మినహా... పోలింగ్ ప్రశాంత వాతావరణంలో పూర్తికావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈవీఎంలను బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నామని చెప్పారు. పోలింగ్ అనంతరం ఘర్షణలు జరగకుండా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి: దుబ్బాకలో భాజపాదే విజయం: బండి సంజయ్