సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కరోనా టీకా కోసం ప్రజలు బారులు తీరారు. 45 ఏళ్లు దాటిన వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం వ్యాక్సినేషన్ నిలిపివేసి... సోమవారం ప్రారంభించడంతో రద్దీ నెలకొంది. మాస్కులు పెట్టుకున్నా... భౌతిక దూరం పాటించడంపై నిర్లక్ష్యం వహించారు.
టీకాపై వైద్యులు, ఆశా వర్కర్లు అవగాహన కల్పిస్తుండడంతో ప్రజలు ఆసక్తి కనబర్చుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్ పరీక్షలను పెంచారు. టీకా పంపిణీ కార్యక్రమం రోజూ కొనసాగుతుందని వైద్యాధికారి సౌమ్య తెలిపారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో అందరూ టీకా తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: దేశంలో 2 లక్షల 73 వేల కేసులు- 1,619 మరణాలు