సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో స్థానిక గ్రామ పంచాయతీ నర్సరీ నుంచి నాటడానికి తెచ్చిన సుమారు 100 మొక్కలు అలాగే వదిలేశారు. దీనితో ఆ మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి.
పల్లె ప్రకృతి వనంలో నాటాడానికి తెచ్చిన మొక్కలు ఇలా నిర్లక్ష్యంగా పడేయడం విమర్శలకు దారి తీస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.
- ఇదీ చదవండి : భువనేశ్వర్ నుంచి తెలంగాణకు ఆక్సిజన్