సిద్దిపేట రూరల్ మండలం సీతారాంపల్లిలో మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. గ్రామాభివృద్ధిపై అధికారులు, స్థానికులతో సమావేశం నిర్వహించారు. వారం రోజుల్లో భూసమస్యలు అధికారులు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అందరూ ఐకమత్యంతో ఉంటే సీతారాంపల్లిని ఎర్రవెల్లిలా మారుస్తామని వివరించారు. త్వరలోనే హెల్త్‌క్యాంప్ నిర్వహిస్తామన్నారు. యువత కోసం జిమ్, గ్రంథాలయంతో పాటు సౌకర్యాలతో కూడిన ఫంక్షన్‌హాల్ ఏర్పాటు చేసుకుందామన్నారు. గ్రామస్థులంతా ఐకమత్యంతో ఉండి అభివృద్ధికి తమ వంతు సాయం చేయాలని హరీశ్‌రావు కోరారు.
ఇవీ చూడండి: జైపాల్‌రెడ్డి: ఉస్మానియా టు పార్లమెంట్