Harishrao Distributes Gruhalakshmi Documents : గత ప్రభుత్వాలు పెండింగ్‌లో ఉంచిన ప్రాజెక్టులను.. కేసీఆర్ పూర్తి చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వడంలేదని మంత్రి హరీశ్‌రావు(Harishrao) విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేస్తుంటే.. ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేశాయని, భూములు ఇవ్వకుండా రైతులను పక్కదారి పట్టించారని మండిపడ్డారు.
Harish Rao Fires on Congress : 'బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి.. కాంగ్రెస్ చెబుతున్న అబద్దాలకు పోటీ'
ఇళ్లు లేని పేదలకు ఇంటి నిర్మాణం కోసం కేసీఆర్ సర్కారు.. గృహలక్ష్మి(Gruhalakshmi Scheme) పథకం ప్రవేశపెట్టిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. మహిళలకు ఇస్తేనే డబ్బులు సద్వినియోగం అవుతాయనే ఉద్దేశంతో.. స్త్రీల పేరు మీదుగానే డబ్బులను జమచేయడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో భాగంగా ఇంటి నిర్మాణానికి మూడు దఫాలుగా మూడు లక్షల రూపాయలను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. లబ్దిదారులందరూ వీలైనంత త్వరగా ఇంటి నిర్మాణం ప్రారంభించాలని మంత్రి సూచించారు.
Harishrao on Congress Leaders : కాంగ్రెస్ హయంలో ఇంటి నిర్మాణం కోసం 60 వేల రూపాయలను నాలుగు దఫాలుగా ఇచ్చేవారని.. అవి చివరకు లబ్దిదారులకు వచ్చే సరికి అప్పు మాత్రమే మిగిలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టులను నిర్మించి.. పేదల బతుకులను బాగు చేశామని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు.. పాలమూరు రంగారెడ్డిని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
తమ పదవులు పోతాయనే భయంతో.. సమైక్యపాలకులకు వత్తాసు పలికారని దుయ్యబట్టారు. వాళ్ల పాలనలో ఫండింగ్ లేక ప్రాజెక్టులను పెండింగ్‌లో పెడితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోందన్నారు. నేడు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో ప్రథమ స్థానానికి చేరుకుని.. దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరుకుందని హార్షం వ్యక్తం చేశారు.
Harishrao Latest News : నిన్న పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిన కేసీఆర్(KCR).. కృష్ణమ్మ నీటిని అక్కడి గ్రామాల సర్పంచ్‌లకు కలశాలలో పంపిణీ చేశారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు ఆనందభాష్పాలు వస్తే.. కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్లు వస్తున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో నోబుల్స్కి, గ్లోబుల్స్కి మధ్య పోటీ జరుగబోతుందన్నారు.
ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ట్రిక్కులు చేసినా.. కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తిట్లతో పోటీపడే నాయకులు కావాలా.? కిట్లు ఇచ్చే ప్రభుత్వం కావాలా? అని ప్రశ్నించారు.
"గత ప్రభుత్వాలు పెండింగ్‌లో ఉంచిన ప్రాజెక్టులను.. కేసీఆర్ పూర్తి చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వడంలేదు. తమ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను నిర్మించి పేదల బతుకులను బాగు చేశామని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు.. పాలమూరు రంగారెడ్డిని ఎందుకు నిర్మించలేదు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తిట్లలో పోటీపడితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం కిట్లను పంపిణీ చేస్తూ ప్రజల సంక్షేమానికి పాటు పడుతోంది". - హరీశ్‌రావు, మంత్రి