ETV Bharat / state

సిద్దిపేట నుంచే మార్పు మొదలవ్వాలి..

సిద్దిపేటను ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా మార్చేందుకు మంత్రి హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారు. పట్టణ కేంద్రంలోని ఒకటో వార్డులో స్టీల్‌ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఎవరింట్లో ఫంక్షన్ జరిగినా స్టీల్‌ బ్యాంక్‌లోని సామాన్లను వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. "ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టేలా..సిద్దిపేట నుంచే మాల్పు మొదలవ్వాలని" పిలుపునిచ్చారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్‌రావు పర్యటన

author img

By

Published : Mar 10, 2020, 6:42 PM IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. రైతు బజారులోని ఏర్పాటు చేసిన రూ.5కే భోజనామృతం కార్యక్రమాన్ని హరీశ్‌ ప్రారంభించారు. కూరగాయలు విక్రయించే మహిళా రైతులతో కాసేపు ముచ్చటించారు. టమాట రైతుల గిట్టుబాటు ధర గురించి మంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

స్టీల్ బ్యాంక్‌ను వినియోగించుకోవాలి..

భవిష్యత్ తరాలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే తడి పొడి చెత్తను కచ్ఛితంగా వేరు చేసి ఇవ్వాలని హరీశ్‌ రావు కోరారు. ప్లాస్టిక్ కవర్ల వల్ల భూమి కలుషితమౌతోందిని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటో వార్డు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. తడి,పొడి చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఒకటో వార్డులో స్టీల్ బ్యాంక్‌ను ప్రారంభించినందున ఎవరి ఇంట్లోనైనా ఫంక్షన్ జరిగితే స్టీల్ బ్యాంకు నుంచి వస్తువులు తీసుకెళ్లి వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మాంసాన్ని స్టీల్ డబ్బా లోనే తీసుకోవాలి హరీశ్‌ కోరారు. "ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టేలా.. మార్పు మన సిద్దిపేట నుంచే మొదలవ్వాలని" పిలుపునిచ్చారు. దోమలు లేని సిద్దిపేటే తన లక్ష్యమన్నారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్‌రావు పర్యటన

ఇవీ చూడండి: కరోనాతో అక్కడి థియేటర్లు, పాఠశాలలు బంద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.