ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి ఇంకే విధంగా ప్రతి బావి దగ్గర పొలం కుంటలను ఏర్పాటు చేసుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు రైతులకు వివరించారు. ఇజ్రాయిల్ దేశంలో వర్షపు నీటిని సంరక్షించుకోవటం వల్ల ప్రపంచంలోనే వ్యవసాయరంగంలో అత్తుత్యమ దేశంగా ఎదిగిందని పేర్కొన్నారు. పొలం గట్ల దగ్గర నీటి నిల్వ కోసం కందకాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీనివలన భూగర్భ జలాలు పెరుగుతాయని హరీశ్ రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవీచూడండి: 'ముమ్మారు తలాక్' బిల్లుకు పార్లమెంటు ఆమోదం