Harish Rao Road Show in Dubbaka : ఓటు అంటే ఐదేళ్ల భవిష్యత్ అని బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దుబ్బాకలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది ఒక సీటు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఒక సీటు మాత్రమే వస్తుందని జోస్యం చెప్పారు. ఒక సీటు వచ్చే బీజేపీ... రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
BRS Election Campaign in Dubbaka : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల సమస్యలు తీర్చలేవని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో దుబ్బాక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేరాయా? అని ప్రజలను అడిగారు. బీజేపీని నమ్మితే ఆగం అవుతామని ప్రజలే చెబుతున్నారని.. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తోందని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే భూములు లాక్కుంటారని.. అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ బీఆర్ఎస్ వస్తే అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్‌ను నమ్మితే ఆగమవ్వుడు ఖాయం : హరీశ్‌రావు
"ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ప్రజలకు నమ్మకం. బీజేపీ వస్తే బోరు బావులకు మీటర్లు వస్తాయి. మీటర్లు పెట్టలేదని కేంద్రం రూ.25 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వలేదు. మీటర్లు పెట్టనందునే రూ.25 వేల కోట్లు ఇవ్వలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే. తెలంగాణలో 24 గంటల పాటు కేసీఆర్ సర్కార్ కరెంట్ ఇస్తుంటే.. కర్ణాటకలో 5 గంటలే కరెంట్ ఇస్తున్నామని డీకే శివకుమార్ చెబుతున్నారు. మీటర్లు, బిల్లు లేకుండా రైతులకు మేం 24 గంటల కరెంట్ ఇస్తున్నాం." - హరీశ్ రావు, రాష్ట్ర మంత్రి
గతంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే పింఛను రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే బీడీ కార్మికులపై కేంద్రం జీఎస్టీ వేసిందని విమర్శించారు. బీడీ కార్మికులకు పింఛను ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ రాకముందు ఇంటింటికి మంచి నీళ్లు వచ్చేవా? అని ప్రజలను మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
స్వార్ధ రాజకీయాలతో అబద్ధాలకు పునాదుల మీద కాంగ్రెస్, బీజేపీలు పబ్బం గడుపుతున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మేనిఫెస్టోతో పాటు రామక్క పాటను కూడా కాంగ్రెస్, బీజేపీ నఖల్ కొట్టారన్నారని వెల్లడించారు. రామక్క పాట తెలంగాణలో దుమ్ము రేపుతున్నదని స్పష్టం చేశారు. పార్టీ కాదు, కేసీఆర్ మీద ప్రేమతో కల్వకుర్తికి చెందిన ఒక చెల్లి రాసిన పాటకు కాంగ్రెస్, బీజేపీ గుండెలు జల్లుమంటున్నాయని వివరించారు.
Harish Rao Election Campaign 2023 : అనంతరం మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్‌పేటలో బీఆర్ఎస్ రోడ్ షోలో పాల్గొన్నారు. కేసీఆర్ వచ్చాక ఒక్క గుంట కూడా ఎండలేదని పేర్కొన్నారు. భూములు లాక్కొంటామని రఘునందన్ అంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు రఘునందన్‌రావు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వం భూములను ఎందుకు లాక్కొంటుంది? అని ప్రజలను మంత్రి ప్రశ్నించారు. రఘునందన్‌రావు అసత్యాలు చెబుతున్నార్న ఆయన.. అసైన్డ్ భూములపై పూర్తి యాజమాన్యపు హక్కులు ఇస్తామని స్పష్టం చేశారు.
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు - కేసీఆర్ రైతు పక్షపాతి అని రుజువు చేశాయి : మంత్రి హరీశ్‌రావు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ కోసం కొట్టుకోడానికే సరిపోతుంది : హరీశ్‌రావు