ETV Bharat / state

మామ వెంటే అల్లుడు... అనితర సాధ్యుడు

హరీశ్​రావు... ఈ పేరు రాష్ట్ర రాజకీయాల్లో ఓ ప్రభంజనం. తెరాస పార్టీలో, తెలంగాణ ఉద్యమంలో ఆయనది కీలక పాత్ర. ఆయన మాటంటే సిద్దిపేట ప్రజలకు వేదవాక్కు. హరీశ్​ అడుగు పెట్టాడంటే ఏ స్థానమైనా అది గులాబీ ఖాతాలో పడిపోవాల్సిందే. అంతలా తెలంగాణ ప్రజల మనసును గెలుచుకున్న నేత మరొకరు ఉండరేమో...! అందుకే 2018 సాధారణ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో విజయం సాధించి... జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ పాలనలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని మరోసారి మంత్రిగా ప్రమాణం చేసిన హరీశ్​రావుపై ఈటీవీభారత్​ ప్రత్యేక కథనం...

మామ వెంటే అల్లుడు... అనితర సాధ్యుడు
author img

By

Published : Sep 8, 2019, 5:05 PM IST

ట్రబుల్ షూటర్.. ఆరున్నర అడుగుల బుల్లెట్.. అభివృద్ధి పైలెట్.. సిద్దిపేట రాకెట్.. హరీశ్​రావు పేరు వినగానే మదిలో మెదిలే పదాలు. తెరాస పార్టీలో, ఉద్యమంలో, ప్రభుత్వంలో ఆయనది కీలక పాత్ర. అన్ని వర్గాలు, పార్టీలు అభిమానించే అతి తక్కువ మందిలో హరీశ్​రావు ఒకరు. అజాత శత్రువుగా ఆయన పేరు సంపాదించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మరొకరు భర్తీ చేయలేని స్థానం హరీశ్​రావుది. 2004లో రాజకీయాల్లోకి వచ్చిన హరీశ్... ఎన్నికల​ బరిలో నిలిచాడంటే ప్రత్యర్థుల ధరావతులు గల్లంతే.
31వ ఏట మంత్రిగా ప్రమాణం
సీఎం కేసీఆర్​కు స్వయాన మేనల్లుడైన హరీశ్​రావు 1972 జూన్ మూడో తేదీన సిద్దిపేట జిల్లా చింతమడకలో జన్మించారు. స్థానికంగానే పాఠశాల విద్యను పూర్తి చేసి హైదరాబాద్​లోని మాసాబ్ ట్యాంకులో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. తన 31వ ఏట 2004లో మంత్రిగా ప్రమాణం చేసి రాజకీయ ముఖచిత్రంలోకి వచ్చారు. నాటి నుంచి నేటి వరకు తన హవా కొనసాగిస్తూనే ఉన్నారు. 2004, 2008, 2010 సంవత్సరాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో.. 2009, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2018 సాధారణ ఎన్నికల్లో విజయంతో 46 సంవత్సరాల వయసులోనే... డబుల్​ హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఒక లక్షా 18 వేల 699 ఓట్ల మెజార్టీ సాధించి... జాతీయ స్థాయిలో అత్యధిక ఓట్లు పొందిన శాసనసభ్యుడిగా రికార్డు నెలకొల్పారు.

మామ వెంటే అల్లుడు... అనితర సాధ్యుడు
మొదటి నుంచి మామ వెంటే... తెరాస స్థాపించిన నాటి నుంచి కేసీఆర్​ వెంటే హరీశ్​రావు ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, పార్టీని పటిష్ఠం చేయడంలో కీలక పాత్ర పోషించి... కేసీఆర్​కు వెన్నుదన్నుగా నిలిచారు. అన్ని వర్గాలను ఏకం చేసి... క్షేత్ర స్థాయిలో స్వరాష్ట్ర ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడంలో హరీశ్​రావుదే కీలక పాత్ర. ఆయన అడుగు పెట్టారంటే... ఎన్నికల్లో ఆ స్థానం గులాబీ ఖాతాలో పడినట్టే. 2014 ఎన్నికల్లో ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను తెరాస గూటికి చేర్చడంలోనూ ముఖ్య పాత్ర పోషించారు.
నీటి పారుదల శాఖ మంత్రిగా చెరగని ముద్ర
తెలంగాణ ఆవిర్భావం తరువాత హరీశ్​రావు 2014లో నీటి పారుదల, మార్కెటింగ్​ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ రెండు శాఖలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దారు. నీళ్ల మంత్రిగా ఉద్యమ ఆకాంక్షలను నేరవేర్చేందుకు ప్రయత్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ప్రాజెక్టుల వద్దే ఉండి... అధికారులను, కాంట్రాక్టర్లను పరుగులు పెట్టించారు. సకాలంలో నిర్మాణాలు పూర్తయ్యేలా కృషి చేశారు. మాజీ గవర్నర్​ నరసింహన్​ హరీశ్​రావు​ను ఏకంగా కాళేశ్వర్ రావుగా కీర్తించారు.
ప్రజల ఇంట్లో మనిషిలా...
హరీశ్ ఏ పదవిలో ఉన్నా... ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నా సిద్దిపేటకు ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గించలేదు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ... వారి ఇంటి మనిషి అయ్యారు. తాను అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా సిద్దిపేట అభివృద్ధిని మాత్రం ఆగనియ్యలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ మంత్రుల కంటే ఎక్కువ నిధులు తన నియోజకవర్గానికి తీసుకువచ్చేలా చేశారు. ఆయన కృషి ఫలితంగా.. ఈ రోజు అభివృద్ధిలో సిద్దిపేట దేశానికే ఆదర్శంగా నిలిచింది.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.