సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్, రంగదాంపల్లి, సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి దసరా వేడుకల్లో భాగంగా... రావణ దహనంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడి, పంటలు పండి ప్రజల ముఖాల్లో సంతోషం కనబడుతుందన్నారు.
నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయన్న హరీశ్‌రావు...త్వరలోనే కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలతో దేవుడి పాదాలు కడిగి, ఈ ప్రాంతాన్ని సశ్యశ్యామలం చేసుకుందామన్నారు. త్వరలో సిద్దిపేటకు రైలుతో పాటు యువత ఉపాధికి భారీ పరిశ్రమలు తీసుకురానున్నట్లు తెలిపారు. వచ్చే దసరాకు అన్నింటినీ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకుందామన్నారు.
- ఇదీ చూడండి : రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతుల ప్రత్యేక పూజలు