ముఖ్యమంత్రి కేసీఆర్ రాకతో చింతలేని గ్రామంగా చింతమడక మారుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. చింతమడకవాసులతో ఆత్మీయానురాగాలు పంచుకునేందుకు కేసీఆర్ వచ్చారని తెలిపారు. ఆమరణ దీక్ష సమయంలో ఈ గ్రామంలో ఒక్క ఇంట్లోనూ పొయ్యి వెలగలేదని హరీశ్ గుర్తు చేశారు. చింతమడక గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పనతోపాటు...ఇల్లులేని వారికి ఇంటి నిర్మాణం చేయిస్తామన్నారు. పరిసర గ్రామాలకు రహదారులు కావాలని విజ్ఞప్తులు అందాయని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాభిృద్ధి కొరకు 10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:హైదరాబాద్ వచ్చేందుకు వణికిపోతున్న డ్రగ్స్ సరఫరా ముఠాలు