సిద్దిపేట జిల్లా దుబ్బాక బాలాజీ గార్డెన్స్‌లో భాజపా ఆధ్వర్యంలో ప్రైవేటు టీచర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావు హాజరయ్యారు. ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్న వారు కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు ఉపాధ్యాయులకు తనవంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రఘునందన్ వెల్లడించారు. ప్రభుత్వం వీరి బాధలను ఇప్పటికైనా గుర్తించి.. సహాయసహకారాలు అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం