ETV Bharat / state

పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో పచ్చదనం : కలెక్డర్ వెంకట్రామ రెడ్డి - సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి

రైతు కల్లాల నిర్మాణంలో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ఇందుకు కృషి చేసిన డీఆర్డీఏ అధికారిక వర్గాలు, వ్యవసాయ శాఖ అధికారులను ఆయన అభినందించారు. జిల్లాలోని ములుగు మండలంలోని క్షీరసాగర్ పల్లె ప్రకృతి వనం, రైతు కల్లాల నిర్మాణ పనులను పరిశీలించారు.

పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో పచ్చదనం : కలెక్డర్ వెంకట్రామ రెడ్డి

author img

By

Published : Sep 20, 2020, 12:20 PM IST

సిద్దిపేట జిల్లాలోని ములుగు మండల పరిధిలోని క్షీరసాగర్​ను సందర్శించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, రైతుల కల్లాల నిర్మాణ పనులను పరిశీలించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరుస్తాయని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రతి మొక్క సంరక్షించాలి..

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, వనంలో ఏర్పాటు చేసిన బెంచీలను పరిశీలించి...‌ సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కలపై అవగహన పెంచేందుకు వనంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి వనం నిర్మాణ పనుల్ని మరింత సుందరీకరణ చేసేందుకు అదనంగా మరికొన్ని నిర్మాణాలను చేపట్టాలని ఎంపీడీఓ, డీఆర్డీఏ అధికారులకు సూచనలు చేశారు.

నిధులు విడుదల చేస్తాం...

అందుకు కావాల్సిన నిధులను తాను మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ అధికారులకు తెలిపారు. ఈ మేరకు ట్రైనీ కలెక్టర్ దీపక్ తివారీ, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్​లతో కలిసి కలెక్టర్ మొక్కను నాటారు.

ఇవీ చూడండి : భగ్గుమంటున్న ధరలు.. సామాన్యునికి కూర'గాయాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.